Andhra Pradesh: వైఎస్ జయంతి నుంచే ‘వైఎస్సార్ పెన్షన్ పథకం’ అమలు చేస్తాం!: ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-7e3af9bba62c2a8c34482f5c42b531c2e3c48e1e.jpg)
- నవరత్నాలను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు
- మా ప్రభుత్వం రైతుల పక్షపాతి
- రైతు భరోసా కింద రూ.12,500 అందిస్తాం
నవరత్నాల అమలును ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం, మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా తెలిపారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అనీ, రైతు భరోసా పథకం కింద ఏటా రూ.12,500 అందిస్తామని పేర్కొన్నారు.
కడప జిల్లాలో జరిగిన ప్రజాపరిషత్తు చివరి సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పుట్టినరోజు అయిన జులై 8 నుంచి ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ను అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. జులై 8ని రైతు దినోత్సవంగా జరుపుతామని పునరుద్ఘాటించారు.