Rohit Sharma: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు

  • అత్యంత వేగంగా 25 సెంచరీలు చేసిన మూడో ఆటగాడు
  • ఈ జాబితాలో అగ్రస్థానంలో హషీం ఆమ్లా
  • ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌కి ఇది మూడో సెంచరీ

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేసిన రోహిత్.. అత్యంత వేగంగా 25 సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 32 ఏళ్ల రోహిత్ 206 ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ విషయంలో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లా ముందున్నాడు. 151 ఇన్నింగ్స్‌లలోనే ఆమ్లా 25 సెంచరీలు బాదాడు. టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ 161 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 109 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 15 ఫోర్లతో 102 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తున్న రోహిత్‌కు ఈ మెగాటోర్నీలో ఇది మూడో సెంచరీ.

Rohit Sharma
icc world cup
Century
  • Loading...

More Telugu News