Ram Madhav: అమ్మఒడి పథకం, ప్రజావేదిక కూల్చివేత అంశాల్లో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది: బీజేపీ

  • 40 లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకోవాలి
  • బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న అపోహను తొలగించాలి
  • టీడీపీ, జనసేన నేతలను బీజేపీలోకి ఆహ్వానించాలి

వైసీపీ నెల రోజుల పాలనపై చర్చించిన బీజేపీ కోర్ కమిటీ అమ్మఒడి పథకం, ప్రజా వేదిక కూల్చివేత అంశాల్లో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించిందని అభిప్రాయపడింది. నేడు గుంటూరులో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హాజరై పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించారు.

40 లక్షల సభ్యత్వాల నమోదును లక్ష్యంగా పెట్టుకోవాలని కోర్ కమిటీ నిర్ణయించింది. ముందుగా ప్రజల్లో బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న అపోహను తొలగించాలని నేతలు సూచించారు. టీడీపీ, జనసేన నేతలను బీజేపీలోకి ఆహ్వానించాలని, సంప్రదింపుల బాధ్యతలను నేతలకు అప్పగించాలని కోర్ కమిటీ నిర్ణయించింది.

Ram Madhav
BJP Core Committee
YSRCP
Praja Vedika
Janasena
Telugudesam
  • Loading...

More Telugu News