Loksabha: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి శివసేనకు ఇచ్చేందుకు అంగీకరించిన బీజేపీ!

  • వైసీపీకి దక్కనుందంటూ జోరుగా ప్రచారం
  • వైసీపీకి కాకుంటే బీజేడీకి అని ఊహాగానాలు
  • శివసేనకు దక్కనుందని స్పష్టం చేసిన సంజయ్ రౌత్

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి వైసీపీకి దక్కనుందంటూ ప్రచారం జోరుగా కొనసాగింది. ఒకవేళ వైసీపీకి ఈ పదవి దక్కకుంటే బీజేడీకి దక్కే అవకాశముందని ఊహాగానాలు చెలరేగాయి. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిపై వైసీపీ, బీజేడీలు విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో బీజేపీ మిత్రపక్షమైన శివసేనకు ఈ పదవి దక్కే అవకాశముందని తెలుస్తోంది. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఈ విషయమై మాట్లాడుతూ ఈ పదవి తమ పార్టీ నేతకే దక్కనుందని స్పష్టం చేశారు. ఈ విషయమై బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోగా ఈ పదవిని భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News