asifbad: అటవీశాఖాధికారిణిపై దాడిని ఖండిస్తున్నా: కేటీఆర్

  • కోనేరు కృష్ణారావు చేసిన పనిపై విచారం వ్యక్తం చేస్తున్నా
  • విధుల్లో ఉన్న ఉద్యోగులపై దాడి చేయ కూడదు
  • చట్టానికి ఎవరూ అతీతులు కారు

అసిఫాబాద్ జిల్లాలోని సార్ సాలాలో అటవీ శాఖాధికారిణి అనిత, సిబ్బందిపై దాడి జరిగిన ఘటనను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు చేసిన పనిపై విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. విధుల్లో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడం సబబు కాదని చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఆయనపై ఇప్పటికే కేసు నమోదైందని, ఆయన్ని అరెస్టు చేశారని చెప్పారు.

కాగా, హరితహారంలో భాగంగా భూములను దున్నడానికి అటవీశాఖాధికారులు, సిబ్బంది కాగజ్ నగర్ మండలంలోని సార్ సాలాకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన వారిపై కోనేరు కృష్ణారావు, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో కోనేరు కృష్ణారావు,  బూర పోషంను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై హత్యాయత్నం, వాహనాల ధ్వంసం కింద కేసులు నమోదు చేశారు.

asifbad
kagajnagar
forest
officer
anitha
KTR
  • Loading...

More Telugu News