Andhra Pradesh: సంఘ్ పరివార్ అండతోనే ముస్లింలు-దళితులపై దాడులు జరుగుతున్నాయి!: మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ

  • జైశ్రీరామ్, వందేమాతరం అనకుంటే కొడుతున్నారు
  • ఇలాంటి దాడులు భవిష్యత్తులో కూడా తగ్గవు
  • ముస్లింలు-దళితులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారు

దేశంలో జైశ్రీరామ్, వందేమాతరం నినాదాలు ఇవ్వనివారిపై కొందరు దుండగులు దాడికి దిగుతున్నారని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో తగ్గబోవని స్పష్టం చేశారు. ఈ అల్లరిమూకలు కేవలం ముస్లింలు, దళితులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నాయని విమర్శించారు. ఢిల్లీలో ఈరోజు జాతీయ మీడియాతో ఒవైసీ మాట్లాడారు.

ఇలాంటి దాడులకు దిగుతున్న మూకలు, సంస్థల వెనుక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్), దాని అనుంబంధ సంస్థలు ఉన్నాయని ఆరోపించారు. గత 70ఏళ్లుగా మౌనంగా ఉన్నది చాలనీ, ముస్లింలు ఇప్పటికైనా మేల్కొనాలని ఒవైసీ ఇటీవల పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు కాకుండా ముస్లింలు సొంత రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Andhra Pradesh
Telangana
MIM
Asaduddin Owaisi
ATTACKS
DALITS
MUSLIMS
RSS
  • Loading...

More Telugu News