Chandrababu: ఒక చిన్న గాయంతో విజయనిర్మల గారు చనిపోయారంటే విధిరాత కాక మరేమిటి?: చంద్రబాబు

  • కృష్ణను పరామర్శించిన చంద్రబాబు
  • కృష్ణకు చిన్న ఇబ్బంది కలగకుండా విజయనిర్మల చూసుకున్నారు
  • ఆమె ఆత్మకు శాంతి కలగాలి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా హైదరాబాద్ వెళ్లారు. ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి నేపథ్యంలో కృష్ణ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఒక చిన్నగాయంతో విజయనిర్మల గారు ప్రాణాలు కోల్పోయారని కృష్ణ గారు చెప్పారని, నిజంగా ఇది విధిరాత కాక మరేమిటి? అంటూ నిర్వేదం ప్రదర్శించారు. కృష్ణ గారికి విజయనిర్మల అతిపెద్ద బలం అని, ఆయనకు చిన్న ఇబ్బంది కలగకుండా ఇప్పటివరకు చూసుకుంటూ వచ్చారని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని చెప్పారు.

Chandrababu
Krishna
Vijayanirmala
  • Loading...

More Telugu News