Andhra Pradesh: సాయిరెడ్డి గారూ.. జైలుకు వెళ్లి బెయిల్ పై ఉన్న వ్యక్తులు మారాలి.. క్లీన్ గా ఉన్న నేను కాదు!: కేశినేని నాని కౌంటర్

  • కేశినేని మారాలన్న విజయసాయిరెడ్డి
  • తాను క్లీన్ గా ఉన్నానని జవాబిచ్చిన కేశినేని
  • సీబీఐ, ఈడీ చార్జిషీట్లు ఉన్న వ్యక్తులు మారాలని చురకలు

విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని ఇకనైనా మారాలని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు చెప్పిన సంగతి తెలిసిందే. చంద్రబాబు బీజేపీని సమర్థిస్తే అందరూ జై కొట్టాలి.. కాంగ్రెస్ తో కలిస్తే గొప్ప నిర్ణయం అని చెప్పాలన్న ఆలోచనను మానుకోవాలని హితవు పలికారు. యుద్దం ఎప్పుడు చేయాలో, సామరస్యంగా ఎప్పుడు వ్యవహరించాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. తాజాగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు.

ఈరోజు ట్విట్టర్ లో కేశినేని నాని స్పందిస్తూ.. ‘విజయసాయిరెడ్డి గారూ.. సీబీఐ, ఈడీ చార్జిషీట్లు ఉన్న వ్యక్తులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లి, బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యక్తులు ముందుగా మారాలి. అంతేతప్ప నాలాంటి నిజాయితీపరులైన వ్యక్తులు మారాల్సిన అవసరం లేదు’ అని చురకలు అంటించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీఎం జగన్ తో పాటు విజయసాయిరెడ్డి గతంలో జైలుకు వెళ్లిన విషయాన్ని కేశినేని నాని ఈ మేరకు పరోక్షంగా ప్రస్తావించారు.

Andhra Pradesh
YSRCP
Telugudesam
Vijay Sai Reddy
Kesineni Nani
Twitter
counter
  • Loading...

More Telugu News