Chandrababu: కృష్ణ ధైర్యంగా ఉండాలి... విజయనిర్మల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: చంద్రబాబు

  • అనుకున్నది పూర్తయ్యేవరకు విశ్రమించని వ్యక్తి విజయనిర్మల
  • టీడీపీతో ఆమెకు దగ్గరి సంబంధాలున్నాయి
  • 1999లో కైకలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం విజయనిర్మల కుటుంబసభ్యులను పరామర్శించారు. కుటుంబసమేతంగా కృష్ణ నివాసానికి వచ్చిన చంద్రబాబు అక్కడ విజయనిర్మలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయనిర్మల ఓ ఆశయం కోసం జీవించిన మహిళ అని, ఆమె ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇలాంటి కష్టకాలంలో కృష్ణ ధైర్యంగా ఉండాలని ఓదార్పువచనాలు పలికారు. అనుకున్న పని పూర్తయ్యేవరకు విశ్రమించని వ్యక్తి విజయనిర్మల అని, ఆమెకు టీడీపీతో దగ్గరి సంబంధాలున్నాయని తెలిపారు. 1999లో టీడీపీ అభ్యర్థిగా కైకలూరు నుంచి పోటీచేశారని, అప్పటినుంచి అనేక పర్యాయాలు రాజకీయపరంగా విజయనిర్మలను కలిశానని వెల్లడించారు. ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.

Chandrababu
Telugudesam
Vijayanirmala
Krishna
  • Loading...

More Telugu News