Vizag: ఓటమిపాలైన వైసీపీ అభ్యర్థులు ఆందోళన చెందొద్దు: మంత్రి మోపిదేవి

  • ఓటమిపాలైన అభ్యర్థులకు పార్టీ అండగా ఉంటుంది
  • చిన్న కారణాల వల్ల విశాఖలో కొన్ని స్థానాల్లో ఓడాం
  • ఏపీలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నా నోటీసులు ఇస్తాం

రాష్ట్రంలో ఎక్కడ అక్రమ నిర్మాణం ఉన్నా నోటీసులు ఇస్తామని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని ఏపీ మంత్రి మోపిదేవి వెంకట రమణ స్పష్టం చేశారు. ఈ విషయంలో చిన్నాపెద్దా తేడా లేదని అన్నారు. విశాఖపట్టణంలో ఈరోజు నిర్వహించిన వైసీపీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలైన అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని, అందుకు, తానే నిదర్శనమని అన్నారు.

చిన్నచిన్న కారణాల వల్ల విశాఖపట్టణంలో వైసీపీ కొన్ని ఎమ్మెల్యే స్థానాలు కోల్పోయామని చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విశాఖపట్టణం అభివృద్ధి చెందిందని, జగన్ హయాంలో ఈ జిల్లాకు పూర్వవైభవం తీసుకొస్తామని అన్నారు.

Vizag
YSRCP
Minister
Mopi devi
jagan
cm
  • Loading...

More Telugu News