Kumaram Bheem Asifabad District: అటవీ సిబ్బందిపై దాడి...ఎమ్మెల్యే సోదరుడిపైనే ఆరోపణలు

  • గాయపడిన ఎఫ్‌ఆర్‌ఓ చోలే...ఇతర సిబ్బంది
  • భూములు స్వాధీనానికి వెళ్లిన సిబ్బంది
  • కుమురం భీం జిల్లాలో ఘటన

హరితహారంలో భాగంగా కుమురం భీం జిల్లా సార్‌సాలా గ్రామంలో అటవీ భూమిని చదును చేసేందుకు ఆదివారం వెళ్లిన అటవీ శాఖ సిబ్బందిపై గ్రామస్థులు మూకుమ్మడి దాడి చేశారు. సాక్షాత్తు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కృష్ణారావు ఆధ్వర్యంలో రైతులు ఈ దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం సార్‌సాలా గ్రామం రణరంగంగా మారింది. సిబ్బందిపై రైతులు కర్రలతో దాడులకు దిగడంతో ఎఫ్‌ఆర్‌ఓ చోలే అనితకు తీవ్రగాయాయ్యాయి.

భూమిని చదును చేసేందుకు ట్రాక్టర్లతో సహా గ్రామానికి చేరుకున్న అటవీ సిబ్బందితో కోనేరు కృష్ణారావు ఆధ్వర్యంలో రైతులు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము భూములు స్వాధీనం చేసుకుంటున్నామని ఎఫ్‌ఆర్‌ఓ అనిత స్పష్టం చేయడంతో ఆగ్రహించిన రైతులు ఆమెపై దాడి చేశారు. ఈ దాడిలో అనిత తీవ్రంగా గాయపడగా, మిగిలిన సిబ్బంది కూడా గాయపడ్డారు. గాయపడిన అనితను కాగజ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Kumaram Bheem Asifabad District
sarsala village
forest dept staff
rided
  • Loading...

More Telugu News