Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని!

  • అమరావతిని కూల్చేసేలా సీఎం చర్యలు
  • గన్నవరం-సింగపూర్ విమానాన్ని రద్దు చేశారు
  • ఫేస్ బుక్ లో విమర్శలు గుప్పించిన టీడీపీ నేత

టీడీపీ నేత, విజయవాడ లోక్ సభ సభ్యులు కేశినేని నాని మరోసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. ‘అమరావతిని కూల్చేద్దాం..హైదరాబాద్ ను అభివృద్ధి చేద్దాం’ అనేలా సీఎం జగన్ చర్యలు ఉన్నాయని కేశినేని నాని విమర్శించారు.

టీడీపీ హయాంలో కట్టిన ప్రజావేదికను కూల్చేశారనీ, గన్నవరం-సింగపూర్ విమాన సర్వీసును రద్దుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాత్రం వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఓ ఫొటోను కేశినేని నాని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Andhra Pradesh
Jagan
Chief Minister
Kesineni Nani
Facebook
  • Loading...

More Telugu News