Bollywood: మా భజరంగీ భాయీజాన్ ప్లాస్టిక్ బాటిల్ తో నీళ్లు తాగడు..సల్మాన్ ఖాన్ ఫన్నీ వీడియో!

  • కోతికి అరటిపండ్లు ఇచ్చిన సల్మాన్
  • ప్లాస్టిక్ బాటిల్ తో నీళ్లు తాగించేందుకు కోతి నో
  • ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసిన సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘భారత్’ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ కొత్త ప్రాజెక్టును ఇంకా ఖరారు చేయలేదు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ దర్శకుడు సందీప్ వంగాతో తర్వాతి సినిమాను సల్మాన్ ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఓ ఫన్నీ వీడియోను విడుదల చేశారు.

అందులో సల్మాన్ ఓ కోతికి అరటిపండ్లు ఇచ్చాక వాటర్ బాటిల్ తో నీళ్లు తాగించేందుకు ప్రయత్నించగా, అది తీసుకోలేదు. కానీ ఓ చిన్న కప్పులాంటి దాంట్లో నీళ్లు ఇవ్వగానే గటగటా తాగేసింది. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సల్మాన్..‘మా భజరంగీ భాయీజాన్ ప్లాస్టిక్ బాటిల్ తో నీళ్లు అస్సలు తాగడు’ అని ట్వీట్ చేశాడు. కాగా, సల్మాన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయీజాన్’ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Bollywood
salman khan
Twitter
monkey
  • Error fetching data: Network response was not ok

More Telugu News