Akash Vijayvargiya: అధికారిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన బీజేపీ ఎమ్మెల్యేకు బెయిలు

  • రెండు కేసుల్లోనూ బెయిలు మంజూరు
  • జైలు బయట ఘన స్వాగతం
  • అధికారులకు మరోమారు హెచ్చరికలు

ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఐఎంసీ) జోనల్ అధికారి ధీరేంద్ర సింగ్‌ను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి అరెస్ట్ అయిన బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గీయ బెయిలుపై బయటకొచ్చారు. ప్రభుత్వ అధికారిపై దాడితోపాటు విద్యుత్ కోతలపై  రాజ్‌బరాలో ఆందోళన చేసిన రెండు కేసుల్లోనూ ఆయనకు బెయిలు మంజూరైంది.

శనివారం బెయిలుపై బయటకొచ్చిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. జైలు నుంచి ఎమ్మెల్యే కాలు బయటపెట్టగానే మద్దతుదారులు పూలదండలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయ్‌వర్గీయ మాట్లాడుతూ జైలులో చాలా బాగా గడించిందన్నారు. ప్రజల బాగు కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, అవినీతిని, ప్రభుత్వ అధికారుల దౌర్జన్యం అంతమయ్యే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Akash Vijayvargiya
bail
jail
Madhya Pradesh
IMC
  • Loading...

More Telugu News