Uttar Pradesh: ‘జైశ్రీరాం’ అనలేదని 16 ఏళ్ల ముస్లిం బాలుడిపై దాడి

  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ఘటన
  • తలపై టోపీ తీసి జైశ్రీరాం అనాలని బెదిరింపు
  • నిరాకరించడంతో దాడి

జైశ్రీరాం అని నినదించలేదని 16 ఏళ్ల ముస్లిం బాలుడిపై నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కిద్వాయ్ నగర్‌కు చెందిన బాలుడు శుక్రవారం మసీదులో నమాజు చదివి ఇంటికి తిరిగి వస్తుండగా బైక్‌లపై వచ్చిన నలుగురు యువకులు బాలుడిని అడ్డుకున్నారు. తలకు పెట్టుకున్న నమాజు టోపీని తీసివేయాలని, జై శ్రీరాం అని నినదించాలని బెదిరించాడు. వారి బెదిరింపులకు బాలుడు లొంగకపోవడంతో టోపీని బలవతంగా తొలగించి దాడిచేసి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

జైశ్రీరాం అనలేదని టోపీ తీసేసి తనపై పిడిగుద్దులు కురిపించి కిందికి తోసేశారని బాధిత బాలుడు తెలిపాడు. ఈ ప్రాంతంలో నమాజు టోపీ ధరించడం నిషేధమంటూ ఇష్టం వచ్చినట్టు కొట్టారని ఆరోపించాడు. తన అరుపులు విన్న సమీపంలోని దుకాణదారులు తనను రక్షించినట్టు బాలుడు తెలిపాడు.

  • Loading...

More Telugu News