liquor: మద్యం బాటిళ్లలో మనుషుల ప్రాణం తీసే కాడ్మియం.. పరిశోధనలో వెల్లడి

  • బ్రిటన్‌లోని ప్లైమౌత్‌ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి
  • రంగు సీసాల్లో ప్రమాదకరస్థాయిలో విష పదార్థాలు
  • హెచ్చరిస్తున్న నిపుణులు

మద్యం సీసాల్లో మనుషుల ప్రాణాలు తీసే ప్రమాదకరమైన కాడ్మియం, లెడ్ వంటి విష పదార్థాలు ఉన్నట్టు ఇటీవల జరిగిన ఓ పరిశోధనలో వెల్లడైంది. రంగు, పారదర్శకంగా ఉండే మద్యం బాటిళ్లలో ఇవి ఎక్కువ పాళ్లలో ఉన్నట్టు  బ్రిటన్‌లోని ప్లైమౌత్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. మద్యం బాటిళ్లు సహా, వివిధ రంగుల్లో లభించే గాజు సీసాలు, వస్తువులు, వాటి స్టిక్కర్లపై చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్టు పేర్కొన్నారు. వీటిలో కాడ్మియం, లెడ్ అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు తేలిందని పరిశోధనకారులు వివరించారు. కాబట్టి రంగు సీసాల్లో లభించే మద్యం, శీతల పానీయాలు, ఇతర డ్రింక్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News