Odisha: భర్తపై దాడిచేసి బంధించి భార్యపై సామూహిక అత్యాచారం

  • అర్ధరాత్రి తలుపు తట్టిన దుండగులు
  • తీసిన వెంటనే బలవంతంగా లోపలికి చొరబాటు
  • ఒడిశాలో ఘటన

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు భర్త, పిల్లలను బంధించి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒడిశాలోని కేంద్రపడ జిల్లాలోని నికారియా ప్రాంతంలో జరిగిందీ ఘటన. శుక్రవారం అర్ధరాత్రి బాధిత కుటుంబం తలుపు తట్టిన ముగ్గురు వ్యక్తులు వారు తలుపుతీయగానే బలవంతంగా లోపలికి చొరబడ్డారు. అనంతరం భర్త, పిల్లలపై దాడిచేసి నిర్బంధించి వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలిసిన గ్రామస్థులు తీవ్ర గాయాలపాలైన దంపతులు, పిల్లలను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Odisha
Gang rape
kendrapada
  • Loading...

More Telugu News