Krishna District: కృష్ణా జిల్లాలో వింత... ఆకాశంలో సూర్యుడి చుట్టూ వలయాలు!

  • విస్మయానికి గురైన కంచికచర్ల ప్రజలు
  • సూర్యుడి చుట్టూ నల్లని వలయాలు
  • వీడియోలు తీసిన జనాలు

సాధారణంగా సముద్రంలో అల్పపీడనాలు, తుపాన్లు ఏర్పడినప్పుడు చంద్రుడి చుట్టూ వలయాలు ఏర్పడుతుంటాయి. దీనినే మన పెద్దలు 'వరదగుడి' అంటారు. ఇది వర్షం కురియడానికి సూచిక అంటారు. అయితే, పట్టపగలు సూర్యుడి చుట్టూ ఏర్పడిన వలయాలు కృష్ణా జిల్లాలో ప్రజలను విస్మయానికి గురిచేశాయి. కంచికచర్ల పట్టణంలో ఎండ భగభగలాడుతున్న సమయంలో సూర్యుడి చుట్టూ నల్లని వలయాలు దర్శనమిచ్చాయి. దాంతో ప్రజలు ప్రత్యేకంగా సూర్యుడ్నే గమనించడం మొదలుపెట్టారు. మరికొందరు ఆసక్తితో వీడియో తీశారు.

Krishna District
Sun
  • Loading...

More Telugu News