Rajinikanth: ఎప్పటినుంచో చేస్తున్నా, ఇన్నాళ్లకు మా సేవలను గుర్తించడం మొదలుపెట్టారు: రజనీకాంత్

  • నీటి సంక్షోభంపై స్పందించిన తలైవా
  • రజనీ మక్కల్ మండ్రం సేవలకు అభినందన
  • నీటి సంరక్షణపై సూచన

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నై నీటి సంక్షోభంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రజనీ మక్కల్ మండ్రం సేవలను అభినందించారు. రజనీ మక్కల్ మండ్రం చెన్నైలో అనేక ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తుండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన పార్టీ సభ్యులు ఎంతో శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. తాము ఎప్పటినుంచో సేవలు అందిస్తున్నా, నీటి ఎద్దడి సందర్భంగానే తమ సేవలను అందరూ గుర్తించడం మొదలుపెట్టారని రజనీ తెలిపారు.చెన్నైలో ఇప్పటికే తీవ్రరూపు దాల్చిన నీటి ఎద్దడి గురించి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీటి ఎద్దడి సమస్య పరిష్కారం కోసం సరైన ప్రణాళికలు రచించాలని కోరారు. చెన్నైలోని చెరువులు, రిజర్వాయర్లలో పూడిక తీసి, వర్షపునీటిని సమర్థవంతంగా నిల్వచేయాలని సూచించారు.

Rajinikanth
Chennai
Water
Crisis
  • Loading...

More Telugu News