crda: గోకరాజు గంగరాజు, చందన బ్రదర్స్ తో పాటు 10 మందికి సీఆర్డీఏ నోటీసులు

  • కరకట్ట వద్ద అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం
  • లింగమనేని రమేశ్, పాతూరి సుధారాణిలకు నోటీసులు
  • అందరికీ నోటీసులు ఇస్తామన్న అధికారులు

ఉండవల్లి సమీపంలో కృష్ణా నది కరకట్ట వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ప్రజావేదికను కూల్చేసిన ప్రభుత్వం ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసింది. తాజాగా, ఈరోజు మరో 10 మందికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు అందించారు. వీరిలో లింగమనేని రమేశ్, నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు రంగరాజు, చందన బ్రదర్స్, తులసీ గార్డెన్స్, పాతూరి సుధారాణి, శైవక్షేత్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, కృష్ణా నది కరకట్ట పక్కనే ఉన్న కట్టడాలన్నింటికీ నోటీసులు ఇస్తామని చెప్పారు.

crda
notice
gokaraju rangaraju
chandana brothers
  • Loading...

More Telugu News