Trivikram Srinivas: కృష్ణ నివాసానికి వెళ్లిన త్రివిక్రమ్ శ్రీనివాస్

  • విజయనిర్మల కుటుంబసభ్యులను పరామర్శించిన త్రివిక్రమ్
  • అదే సమయంలో మహేశ్ బాబు, నరేశ్ రాక
  • వారికి ధైర్య వచనాలు చెప్పిన త్రివిక్రమ్

టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రముఖ దర్శకనటి విజయనిర్మల మృతికి సంతాపం తెలియజేశారు. త్రివిక్రమ్ ఇవాళ కృష్ణ నివాసానికి వెళ్లి విజయనిర్మల కుటుంబసభ్యులను పరామర్శించారు. త్రివిక్రమ్ అక్కడ ఉండగానే మహేశ్ బాబు, నరేశ్ వచ్చారు. వారిద్దరితోనూ త్రివిక్రమ్ మాట్లాడి ఓదార్పు వచనాలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు చిత్రపరిశ్రమలో విజయనిర్మల వంటి ప్రతిభావంతులు ఎంతో అరుదుగా కనిపిస్తారని, నటిగా, దర్శకురాలిగా అనేక ఘనతలు అందుకోవడం ఆమెకే చెల్లిందని అన్నారు.

Trivikram Srinivas
Tollywood
Mahesh Babu
  • Loading...

More Telugu News