Andhra Pradesh: విశాఖ భూ కుంభకోణంపై సీఎం జగన్ కు కన్నా బహిరంగ లేఖ!

  • టీడీపీ హయాంలో విశాఖ భూకుంభకోణం జరిగింది
  • దానిపై సిట్ వేసినా నివేదిక బయటపెట్టలేదు
  • సీఎం జగన్ దోషులపై చర్యలు తీసుకోవాలి

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. విశాఖపట్నంలో గత ప్రభుత్వ హయాంలో భూ కుంభకోణానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ సీఎంను కోరారు. టీడీపీ ప్రభుత్వం ఈ భూ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించిందని గుర్తుచేశారు. అయితే ఈ నివేదికను మాత్రం ప్రభుత్వం బయటపెట్టలేదనీ, దాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్నా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కోరారు.

Andhra Pradesh
Jagan
Chief Minister
BJP
kanna
lakshmi narayana
  • Loading...

More Telugu News