manthena satyanarayana raju: మంతెన సత్యనారాయణరాజుకు నోటీసులు ఇచ్చిన సీఆర్డీయే

  • కరకట్టపై సత్యనారాయణరాజు ఆశ్రమం
  • కరకట్ట పక్కన ఆరోగ్యాలయం
  • నోటీసులు జారీ చేసిన సీఆర్డీఏ

మంతెన సత్యనారాయణరాజుకు చెందిన ఆశ్రమానికి సీఆర్డీఏ అధికారులు ఇటీవల రెండు రకాల నోటీసులు జారీ చేశారు. కరకట్టపై ఆశ్రమాన్ని నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై ఈనెల 16న హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వివరణ ఇచ్చేందుకు ఆశ్రమ నిర్వాహకులకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని సీఆర్డీఏకు హైకోర్టు సూచించింది.

ఇదే విధంగా కరకట్ట పక్కనే నిర్మించిన ఆరోగ్యాలయంలో కూడా నిబంధనలను ఉల్లంఘించారని నోటీసులు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసుల అంశంలో కూడా నిర్వాహకులకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. నిర్వాహకులు వివరణ ఇచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే, నోటీసులను జారీ చేసిన విషయాన్ని సీఆర్డీఏ అధికారులు గోప్యంగా ఉంచారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News