Andhra Pradesh: రెండేళ్లలో చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం.. ఇది 100 శాతం గ్యారెంటీ!: బీజేపీ నేత సునీల్ దేవ్ ధర్

  • గజదొంగగా మారి చంద్రబాబు దోచుకున్నారు
  • ఏపీలో టీడీపీ దొంగల పార్టీగా మారిపోయింది
  • కర్నూలులో బీజేపీ కార్యకర్తలతో సునీల్ భేటీ

రాబోయే రెండేళ్లలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ ఇన్ చార్జి సునీల్ దేవ్ ధర్ హెచ్చరించారు. గజదొంగగా మారిన చంద్రబాబు కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం 100 శాతం ఖాయమని పునరుద్ఘాటించారు.

ఏపీలోని కర్నూలు జిల్లాలో బీజేపీ కార్యకర్తలతో జరిగిన భేటీలో సునీల్ దేవ్ ధర్ ఈ మేరకు మాట్లాడారు. ఏపీలో టీడీపీ దొంగల పార్టీగా, తెలుగు డ్రామా పార్టీగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ దొంగల ముఠాకు నాయకుడు చంద్రబాబు నాయుడేనని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో గ్రామగ్రామాన అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని విమర్శించారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Kurnool District
BJP
sunil devara
2 years jail
warning
  • Loading...

More Telugu News