Reliance: ఇషా అంబానీకి అత్తింటి నుంచి ఖరీదైన కానుక.. రూ.450 కోట్ల విలువైన భవనం గిఫ్ట్

  • గతేడాది ఇషా అంబానీ-ఆనంద్ పిరమల్ వివాహం
  • వర్లీలోని అత్యాధునిక భవనాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన పిరమల్ కుటుంబం
  • వైరల్ అవుతున్న ఫొటోలు

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ-నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీకి అత్తింటి వారి నుంచి ఖరీదైన భవనం బహుమతిగా లభించింది. దక్షిణ ముంబై వర్లీలోని 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన గలీటా భవనాన్ని ఆమెకు బహుమతిగా అందించారు. దీని ఖరీదు రూ.450 కోట్ల పైచిలుకేనని అంచనా. సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ భవనాన్ని పిరమల్ కుటుంబ సభ్యులు గతేడాదే సొంతం చేసుకున్నారు. అనంతరం రీమోడల్ చేయించుకున్నారు.

ఇషా అంబానీ-ఆనంద్ పిరమల్ వివాహం గతేడాది అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి దేశ విదేశాల్లోని ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు తమ కోడలికి పిరమల్ కుటుంబం ఖరీదైన భవానాన్ని గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇప్పుడీ ఇంటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ భవనంలో వినియోగించిన ఫర్నిచర్‌ను విదేశాల్లో తయారుచేయించడం విశేషం. అంతేకాదు, మరెన్నో విశేషాలు ఈ భవనానికి వున్నాయి. 

Reliance
Isha ambani
Anand piramal
Mumbai
  • Loading...

More Telugu News