YSRCP: మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదన్న బొండా ఉమా పిటిషన్ కొట్టివేత

  • ఏపీ హైకోర్టులో ఇటీవల పిటిషన్ వేసిన ఉమా
  • ఈవీఎంలను సరిగా లెక్కించలేదని ఆరోపణ
  • ఈ పిటిషన్ కు విచారణార్హత లేదన్న ధర్మాసనం

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ ఆయనపై ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి బొండా ఉమా మహేశ్వరరావు ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, ఈ పిటిషన్ కు విచారణార్హత లేదని చెబుతూ కొట్టివేసింది. ఓట్ల లెక్కింపు రోజున ఈవీఎంలను సరిగా లెక్కించలేదంటూ ఉమ తన పిటిషన్ లో ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఇటీవల తన వాదనలను హైకోర్టుకు వినిపించింది. ఉమా దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించాల్సిన పని లేదని సీఈసీ కోర్టుకు విన్నవించింది.

YSRCP
Vijayawada
Malladi
Telugudesam
bonda
Uma
  • Loading...

More Telugu News