Andhra Pradesh: ఏపీ, తెలంగాణలోని మెట్ట ప్రాంతాలకు నీరు అందించడమే లక్ష్యం: ఈటల రాజేందర్

  • మంత్రులు బుగ్గన, ఈటల మీడియా సమావేశం
  • నీటిపారుదలపై, పునర్విభజన చట్టాలపై చర్చించాం
  • ఇరు రాష్ట్రాల ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ధ్యేయం

ఏపీ, తెలంగాణ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈటల రాజేందర్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, నీటిపారుదలపై, పునర్విభజన చట్టాలపై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాలకు నీరు అందించడమే తమ లక్ష్యమని అన్నారు. షెడ్యూల్ 9,10 లోని అంశాలను పరిష్కరించే దిశగా చర్చించామని చెప్పారు. నదీ జలాలను రెండు రాష్ట్రాలు వినియోగించుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. ఇరు రాష్ట్రాల ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ధ్యేయమని, సమస్యలు పరిష్కరించుకుంటేనే రాష్ట్రాలు బాగుపడతాయని, తెలంగాణ, ఏపీలు గొప్ప వ్యవసాయ రాష్ట్రాలుగా ఎదగాలని ఈటల ఆకాంక్షించారు.

Andhra Pradesh
Telangana
Buggana
Eetala
  • Loading...

More Telugu News