Chandrababu: నాడు చంద్రబాబు పెద్ద తప్పిదం చేశారు.. జగన్ చక్కటి ఆలోచన చేయాలి: శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి

  • శైవ క్షేత్రానికి నోటీసులు ఇవ్వనున్న సీఆర్డీఏ
  • నాడు బెజవాడలో దేవాలయాలను బాబు తొలగించారు
  • అదే ఆయనకు శాపంగా మారింది

కృష్ణా కరకట్టపై తాళ్లాయపాలెంలో నిర్మించిన శైవ క్షేత్రానికి సీఆర్డీఏ నోటీసులు సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి స్పందిస్తూ, విజయవాడలో దేవాలయాలను తొలగించిన గత సీఎం చంద్రబాబునాయుడు పెద్ద తప్పిదం చేశారని, అదే ఆయనకు శాపంగా మారిందని విమర్శించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుని శాపగ్రస్త ప్రభుత్వం కాకుండా ఉండాలంటే సీఎం జగన్ చక్కటి ఆలోచన చేయాలని సూచించారు. కొండలు, అడవులు, నదీ, సముద్ర తీరాలలో దేవాలయాలు ఉంటాయని, ఆలయాలు, పవిత్రమైన స్థానాల వంటి వాటి జోలికి రాకూడదని అన్నారు.

Chandrababu
jagan
cm
shivaswamy
Undavalli
  • Loading...

More Telugu News