Chandrababu: చంద్రబాబుపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు: అచ్చెన్నాయుడు

  • చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు
  • ఏపీలో సమస్యలను పక్కనపెట్టారు
  • జగన్ పాలనను ప్రజలు గమనిస్తున్నారు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపణలు గుప్పించారు. ఉండవల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏపీలో సమస్యలను పక్కనపెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.

ఏపీ ప్రజలు విశ్వాసంతో వైసీపీకి అధికారమిస్తే ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. నెల రోజుల జగన్ పాలన ఏ విధంగా ఉందో ప్రజలు గమనిస్తున్నారని, ముప్పై రోజుల పాలనలో ఒక్క సమస్యపైనా అయినా దృష్టి పెట్టారా? అని ప్రశ్నించారు. సమస్యలతో అల్లాడుతున్న రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రం కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడ్డారని అచ్చెన్నాయుడు గుర్తుచేసుకున్నారు.

Chandrababu
Telugudesam
atchanaidu
YSRCP
jagan
  • Loading...

More Telugu News