harish rao: ప్రజా జీవితంలో పదవి అవసరం లేదు: హరీశ్ రావు

  • పదవి లేకున్నా పనులు చేయవచ్చు
  • మనం చేసే మంచి పనులు ప్రజల్లో నిలిచిపోతాయి
  • రాజకీయాల్లో పదవీ విరమణ ఉండదు

పదవిలో ఉన్నప్పుడు ఎంత గొప్పగా చేశామన్నది మాత్రమే ముఖ్యం కాదని... పదవి లేని సమయంలో మనం చేసే మంచి పనులే ప్రజల్లో నిలిచిపోతాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజా జీవితంలో పదవే అవసరం లేదని... పని చేయాలనుకుంటే పదవి లేకున్నా చేయవచ్చని చెప్పారు. రాజకీయాల్లో పదవీ విరమణ ఉండదని అన్నారు. సంగారెడ్డిలో జరిగిన జిల్లాపరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లా పరిషత్ కు సంబంధించి ఈ ఐదేళ్లలో ఎంతో మార్పు వచ్చిందని... గతంలో మధ్యాహ్నం వరకు కరెంట్ మీదే చర్చ జరిగేదని... ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయిందని చెప్పారు. దీనికితోడు ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగినన్ని ట్రాన్స్ ఫార్మర్లు ఇచ్చారని తెలిపారు. మిషన్ భగీరథతో 90 శాతం నీటి సమస్య తీరిందని అన్నారు.

harish rao
TRS
sangareddy
  • Loading...

More Telugu News