Twitter: ఇంగ్లండా? ఇండియానా?... నాసర్ హుస్సేన్ ప్రశ్నకు ముక్తకంఠంతో ఒకే సమాధానం చెప్పిన పాకిస్థానీలు!

  • ట్విట్టర్ వేదికగా ప్రశ్న
  • ఇండియాకే మద్దతంటున్న పాక్ వాసులు
  • ఆక్రమణదారులకు మద్దతివ్వబోమని వ్యాఖ్యలు

ఆదివారం నాడు జరగనున్న భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ లో మీ మద్దతు ఎవరికి? అంటూ ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ పాక్ అభిమానులను ప్రశ్నించిన వేళ, అత్యధిక సమాధానాలు భారత్ వైపే వచ్చాయి. నాసిర్ వేసిన ప్రశ్న నెట్టింట వైరల్ కాగా, ఎంతో మంది సెలబ్రిటీలు, వీఐపీలు, మాజీ క్రికెటర్లు స్పందించారు.

ఇండియా తమ పొరుగు దేశమని, ఇంగ్లండ్ ఆక్రమణదారని గుర్తు చేసిన క్రికెట్ ఫ్యాన్స్, తాము ఇండియావైపే నిలుస్తామని తేల్చి చెప్పారు. పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్, ప్రీ కాంబ్రియన్, సియాసత్ వంటి న్యూస్ సంస్థలు కూడా నాసిర్ ట్వీట్ కు రిప్లయ్ ఇస్తూ, ఇండియాకు మద్దతు పలుకుతామని చెప్పడం గమనార్హం. ఇక కెవిన్ పీటర్ సన్ వంటి క్రికెటర్లు, నీవు ఎవరికి మద్దతిస్తున్నావని ఎదురు ప్రశ్నించారు. కాగా, ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే, పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సులభమవుతాయి. ఇంగ్లండ్ గెలిస్తే, పాక్ అవకాశాలు క్లిష్టమవుతాయి.

Twitter
India
England
Pakistan
Nasir Hussain
  • Error fetching data: Network response was not ok

More Telugu News