Wakar Younis: అది ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అసాధారణ అంశం: వకార్ యూనిస్!

  • 1992లో జరిగినట్టుగానే ఇప్పుడు కూడా
  • నాటి పాక్ పయనాన్ని ఇప్పుడు మరచిపోలేం
  • మిగతా మ్యాచ్ లు గెలిస్తేనే సెమీస్ కు పాక్
  • మాజీ పేస్ బౌలర్ వకార్ యూనిస్

పాకిస్థాన్ విషయంలో అచ్చం 1992 వరల్డ్ కప్ లో జరిగినట్టుగానే, ఇప్పుడు కూడా జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అసాధారణ అంశం మాత్రమేనని, ఇప్పటి జట్టు, ఈ సారూప్యతను మరచిపోయి, ఆటపై మాత్రమే దృష్టిని సారించాలని మాజీ పేస్ బౌలర్ వకార్ యూనిస్ సలహా ఇచ్చారు. గత వారంలో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లపై విజయంతో పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయని, వాటిని కాపాడుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. మిగిలిన రెండు మ్యాచ్ లనూ తప్పనిసరిగా గెలిస్తేనే టాప్ -4లో ఉండి సెమీస్ కు వెళ్లవచ్చని వకార్ గుర్తు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు రాసిన ఓ కాలమ్ లో 1992 సారూప్యతలను మరచిపోవడం అసాధ్యంగా మారిందని, ప్రతి పాక్ క్రికెట్ అభిమానికీ అది అనుక్షణం గుర్తుకు వస్తోందని అన్నారు. ఆటగాళ్లు కూడా ఈ విషయాన్ని ఆలోచించకుండా ఉండలేకున్నారని చెప్పారు. ఇంగ్లండ్ జట్టు శ్రీలంక, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో పాక్ అవకాశాలు బలపడ్డాయని వకార్ అభిప్రాయపడ్డాడు.

Wakar Younis
Pakistan
Cricket
  • Loading...

More Telugu News