rajasekhara reddy: రాజశేఖరరెడ్డి అనుమతించినవాటికి జగన్ నోటీసులు పంపడమేంటి?: యనమల

  • వైయస్ సీఎంగా ఉన్నప్పుడు లింగమనేని గెస్ట్ హౌస్ ను నిర్మించారు
  • అక్రమ కట్టడమైతే వైయస్ ఎందుకు చర్యలు తీసుకోలేదు
  • తండ్రి ఇచ్చిన అనుమతులకు జగన్ బాధ్యత వహించాలి

చంద్రబాబుపై కక్షసాధింపే ధ్యేయంగా సీఎం జగన్ పని చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను నిర్మించినప్పుడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పారు. ఒకవేళ అది అక్రమ కట్టడమైతే... వైయస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలకు ఆనాటి వైయస్ ప్రభుత్వం ఎందుకు అనుమతులు ఇచ్చిందని అడిగారు.

వైయస్ రాజశేఖరరెడ్డి పేరుతో ఉన్న పార్టీని జగన్ నడుపుతున్నారని... వైయస్ బొమ్మను పెట్టుకుని పాలన చేస్తున్నారని... ఈ నేపథ్యంలో, తన తండ్రి ఇచ్చిన అనుమతులకు జగనే బాధ్యత వహించాలని యనమల అన్నారు. తండ్రి అనుమతులిచ్చిన భవనాలకు కొడుకు నోటీసులు పంపడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ భవన నిర్మాణానికి 2008లో గ్రామ పంచాయతీ, 2012లో రివర్ కన్జర్వేటర్ అనుమతి ఇచ్చారని తెలిపారు. కూలగొట్టడం, దాడులు చేయడం, భయోత్పాతం సృష్టించడమే జగన్ దినచర్య అని అన్నారు.

rajasekhara reddy
jagan
Chandrababu
yanamala
lingamaneni
ysrcp
Telugudesam
  • Loading...

More Telugu News