Singer: సారీ పోలీస్... పొరపాటున పెట్టాను, డిలీట్ చేశాను: గాయని చిన్మయి

  • ఫేక్ పోస్ట్ పై స్పందించిన చిన్మయి
  • అసలు వివరం చెప్పిన యూపీ పోలీసులు
  • తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పిన చిన్మయి

పోలీసులపై వచ్చిన ఓ ఫేక్ పోస్ట్ పై స్పందించి, నిందారోపణలు చేసిన గాయని చిన్మయి, ఆ తరువాత విషయం తెలుసుకుని నాలిక్కరుచుకుంది. పొరపాటున తాను ట్వీట్ చేశానని, దాన్ని డిలీట్ చేశానని చెబుతూ, క్షమాపణలు చెప్పింది. ఇంతకీ ఏమైందంటే... యూపీకి చెందిన ఓ అధికారి, తనవద్దకు వచ్చిన అత్యాచార బాధితురాలిని, కోరిక తీర్చమని అడిగాడట. ఆ పోస్ట్ ను చూసిన చిన్మయి, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసే ఇలా ప్రవర్తిస్తే ఎలా? అంటూ మండిపడ్డారు.

ఇక ఈ ట్వీట్ వైరల్ కావడంతో యూపీ పోలీసులు స్పందించారు. ఇది ఎప్పుడో 2017లో జరిగిన ఘటనని, మూడేళ్ల తరువాత ఓ సెలబ్రిటీ గుర్తు చేయడం ఆమె బాధ్యతారాహిత్యమని అన్నారు. ఇది ఫేక్ న్యూస్ అని, అప్పట్లో ఎస్ఐపై విచారణ జరుపగా, అది అబద్ధమని తేలిందని స్పష్టం చేశారు. ఆమెపై అత్యాచారమే జరగలేదని చెబుతూ, రీట్వీట్ చేశారు. దీన్ని చూసిన చిన్మయి, తన తప్పు తెలుసుకుంది. తనను గుర్తించినందుకు ధన్యవాదాలని చెప్పింది. ఈ తరహా ఘటనలు తనకు తెలిస్తే, సోషల్ మీడియాలో పెడుతుంటానని, బాధితులకు న్యాయం జరగాలన్నదే తన ఉద్దేశమని పేర్కొంది.

Singer
Chinmayi
Uttar Pradesh
Police
Fake Post
  • Loading...

More Telugu News