vijaya nirmala: విజయనిర్మల అంతిమయాత్ర ప్రారంభం

  • నానక్ రామ్ గూడలోని నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర
  • విజయకృష్ణ గార్డెన్స్ లో అంత్యక్రియలు
  • 11.30 గంటలకు అంత్యక్రియలు జరిగే అవకాశం

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత దివంగత విజయనిర్మల అంతిమయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని ఆమె నివాసం నుంచి బంధువులు, అభిమానుల కన్నీటి మధ్య తుది యాత్ర మొదలైంది. చిలుకూరు సమీపంలో ఉన్న విజయకృష్ణ గార్డెన్స్ లో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు. 11.30 గంటలకు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతిమయాత్రకు భారీ సంఖ్యలో సినీ రంగానికి చెందిన వ్యక్తులు, అభిమానులు తరలి వచ్చారు. బుధవారం రాత్రి గుండెపోటుతో విజయనిర్మల తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

vijaya nirmala
final journey
tollywood
  • Loading...

More Telugu News