Jagan: విజయనిర్మలకు జగన్ ఘన నివాళి

  • విజయనిర్మల నివాసానికి వచ్చిన జగన్
  • కృష్ణను పరామర్శించిన జగన్
  • వెంట విజయసాయి, కోమటిరెడ్డి

మొన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూసిన ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల భౌతికకాయానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఈ ఉదయం ఆమె నివాసానికి వచ్చిన జగన్, పుష్పాంజలి ఘటించారు. అనంతరం విజయనిర్మల కుమారుడు నరేశ్ ను జగన్ ఓదార్చారు. ఆదిశేషగిరిరావు తదితరులతో మాట్లాడారు. అనంతరం లోపలి వెళ్లి కృష్ణను పరామర్శించారు. ఘట్టమనేని కుటుంబ సభ్యులతోనూ జగన్ కొద్దిసేపు మాట్లాడారు. జగన్ వెంట ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉండటం గమనార్హం.

Jagan
Vijayanirmala
Krishna
Vijay Sai Reddy
  • Loading...

More Telugu News