Varadapuram Suri: చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి

  • ధర్మవరం తాజా మాజీ ఎమ్మెల్యే సూరి
  • ఓటమి తరువాత బీజేపీలో చేరాలని నిర్ణయం
  • ఆపేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలు

అనంతపురం జిల్లాలో తెలుగుదేశం ముఖ్య నేత, ధర్మవరం తాజా మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, బీజేపీలో చేరాలని నిర్ణయించుకుని, పార్టీ అధినేతకు తన రాజీనామా లేఖను పంపారు. పార్టీలో ఎంతో క్రియాశీలకంగా, జిల్లా కార్యదర్శిగా ఉన్న ఆయన, ఈ నిర్ణయం తీసుకోవడంతో పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు. సూరితోపాటు, మరికొందరు నేతలు బీజేపీలోకి వెళ్తారని ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ప్రచారం జరుగుతుండగా, అది అవాస్తవమని సూరి కొట్టిపారేశారు.

తాజాగా, నిన్న ధర్మవరంలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన, మనసులోని మాటను చెప్పి, ఆ వెంటనే రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. రెండు మూడు రోజుల్లో సూరి, బీజేపీలో చేరుతారని భావిస్తున్నారు. కాగా, ఆయన్ను ఆపేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలు, నిన్న రాత్రి సూరి ఇంటికి వెళ్లారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు సూరితో భేటీ అయ్యారు. వీరి మధ్య రెండు గంటల పాటు చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

Varadapuram Suri
Anantapuram
Telugudesam
BJP
Resign
Chandrababu
  • Loading...

More Telugu News