Team India: మాంచెస్టర్ లో టీమిండియా విజయహేల... విండీస్ పై ఘనవిజయం

  • సెమీస్ ముంగిట టీమిండియా
  • సమష్టిగా రాణించిన భారత బౌలర్లు
  • విఫలమైన విండీస్ బ్యాట్స్ మెన్

మాంచెస్టర్ లో వెస్టిండీస్ తో వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 269 పరుగుల లక్ష్యఛేదనలో కరీబియన్లు 34.2 ఓవర్లలో 143 పరుగులకే చాపచుట్టేశారు. గేల్ సహా టాపార్డర్ బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో విండీస్ కు పరాభవం తప్పలేదు. మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, చాహల్, కుల్దీప్, పాండ్య విండీస్ బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశారు. ఏ దశలో కూడా కరీబియన్ జట్టు గెలుపు దిశగా సాగుతున్నట్టు కనిపించలేదు. ఆ జట్టులో ఓపెనర్ సునీల్ ఆంబ్రిస్ సాధించిన 31 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు, బుమ్రా, చాహల్ రెండేసి వికెట్లు తీశారు. కాగా ఈ విజయంతో టీమిండియా సెమీస్ ముంగిట నిలిచింది. మరొక్క విజయం కానీ, మరొక్క పాయింట్ కానీ సాధిస్తే భారత్ కు సెమీస్ బెర్తు ఖాయమవుతుంది.

Team India
West Indies
World Cup
  • Loading...

More Telugu News