India: మాంచెస్టర్ లో భారత బౌలర్ల జోరు... విండీస్ టాపార్డర్ విలవిల

  • 98 పరుగులకే 5 వికెట్లు డౌన్
  • నిరాశపరిచిన గేల్, హోప్
  • నిప్పులు చెరిగిన షమీ

టీమిండియా బౌలర్లు మరోసారి క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ప్రదర్శన చేశారు. మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్ తో మ్యాచ్ లో పేసర్లు, స్పిన్నర్లు సమష్టిగా కదం తొక్కారు. 269 పరుగుల లక్ష్యఛేదనలో విండీస్ జట్టు భారత బౌలర్ల ధాటికి 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మహ్మద్ షమీ ఆరంభంలో 2 వికెట్లు తీసి కరీబియన్లను దెబ్బకొట్టగా, ఆపై పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తలో వికెట్ చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం విండీస్ 26 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. క్రీజులో హెట్మెయర్, బ్రాత్ వైట్ ఉన్నారు. విండీస్ గెలవాలంటే 24 ఓవర్లలో 162 పరుగులు చేయాల్సివుంది.

India
West Indies
World Cup
  • Loading...

More Telugu News