MS Dhoni: ఆఖరి ఓవర్లో రెండు సిక్స్ లు బాదిన ధోనీ... టీమిండియా స్కోరు 50 ఓవర్లలో 268/7

  • కోహ్లీ, ధోనీ అర్ధసెంచరీలు
  • రాణించిన పాండ్య, రాహుల్
  • కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన విండీస్ బౌలర్లు

వెస్టిండీస్ తో వరల్డ్ కప్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్ పై విండీస్ బౌలింగ్ కట్టుదిట్టంగా ఉండడంతో భారత బ్యాట్స్ మెన్ ఈ పోరులో స్వేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించలేకపోయారు. ఓపెనర్ రాహుల్ 48 పరుగులు చేసి శుభారంభం ఇవ్వగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి 82 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ఎంఎస్ ధోనీ 56 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ధోనీ విశ్వరూపం ప్రదర్శించాడు. రెండు భారీ సిక్స్ లు, ఒక ఫోర్ తో విరుచుకుపడ్డాడు. దాంతో ఆ ఓవర్ లో 16 పరుగులు వచ్చాయి. అంతకుముందు, ధోనీతో కలిసి హార్దిక్ పాండ్య దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. పాండ్య కేవలం 38 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో కీమార్ రోచ్ 3 వికెట్లు తీయగా, కెప్టెన్ జాసన్ హోల్డర్, షెల్డన్ కాట్రెల్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

  • Loading...

More Telugu News