clat: ‘క్లాట్’ టాప్ ర్యాంకర్లకు తన సక్సెస్ రహస్యం చెప్పేసిన నారా భువనేశ్వరి!

  • నిబద్ధత, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం
  • క్లాట్ టాపర్లకు బహుమతులు ప్రదానం చేసిన భువనేశ్వరి
  • అంకితభావంతో చేసే పనివల్లే సంతృప్తి దక్కుతుందని వ్యాఖ్య

నిబద్ధత, పట్టుదల, ఏకాగ్రత ఉంటే ఏ పనిని అయినా సాధించవచ్చని హెరిటేజ్ గ్రూప్ వైఎస్ చైర్మన్, ఎండీ నారా భువనేశ్వరి తెలిపారు. ఇటీవల విడుదలైన కామన్ లా అడ్మిషన్ టెస్టు(క్లాట్)లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన హైదరాబాద్ లోని ఎన్టీఆర్ కళాశాల విద్యార్థులను ఆమె ఈరోజు అభినందించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం టాప్ ర్యాంకర్లతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.

అనంతరం మాట్లాడుతూ.. క్లాట్ పరీక్షలో రిజర్వేషన్ కేటగిరిలో 3,11 ర్యాంకులను తమ విద్యార్థులు సాధించారని భువనేశ్వరి తెలిపారు. ఓపెన్ కేటగిరిలో 3,6,9 ర్యాంకులను తమ విద్యార్థులు సాధించారని చెప్పారు. అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులను తాను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

తాను ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటాననీ, క్షేత్రస్థాయిలో ప్రతీ ఒక్కరితో మమేకం అవుతూ ఉంటానని భువనేశ్వరి చెప్పారు. అందుకే తన నేతృత్వంలోని హెరిటేజ్ కంపెనీ సక్సెస్ అయిందని తెలిపారు. అంకితభావంతో చేసే పనివల్లే సంతృప్తి దక్కుతుందనీ, విశ్రాంతి తీసుకుంటేనో, డబ్బువల్లో ఆత్మసంతృప్తి దక్కదని ఆమె స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News