Balakrishna: హిందూపురం నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చాలి... ప్రభుత్వానికి చెబుతా: నందమూరి బాలకృష్ణ

  • ఏపీ ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని కొనసాగించాలి
  • లేపాక్షిలో బాలయ్య పుస్తకాల పంపిణీ
  • బాలయ్య మాట్లాడుతుండగా కరెంట్ కట్

నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగులు లేని సమయంలో హిందూపురం నియోజకవర్గానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంటారు. ఎమ్మెల్యేగా తన బాధ్యత నిర్వర్తించడంపై దృష్టిపెడుతుంటారు. ఇవాళ కూడా తన నియోజవకర్గంలో పర్యటించిన బాలయ్య లేపాక్షిలో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఏపీ ప్రభుత్వం బడిబాట కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూపురం నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరతానని చెప్పారు. కాగా, తాను మాట్లాడుతుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 'ఇదీ, ఈ ప్రభుత్వ పాలనాతీరు!' అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక, రాయలసీమ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు.

Balakrishna
Hindupur
Lepakshi
MLA
  • Loading...

More Telugu News