Andhra Pradesh: చంద్రబాబు ఇంటి వేట.. వెలగపూడిలో 90 ఏళ్లనాటి ఇల్లును పరిశీలించిన టీడీపీ నేతలు!

  • కరకట్టపై నిర్మాణాలు కూల్చేస్తామంటున్న సర్కారు
  • ఇప్పటికే ప్రజావేదిక కూల్చివేత
  • కొత్త ఇంటిని పరిశీలించిన ఏపీ టీడీపీ చీఫ్ కళా వెంకట్రావు

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ప్రస్తుత నివాసంపై వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రజావేదికను కూల్చేసిన ఏపీ ప్రభుత్వం, కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను సైతం తొలగిస్తామని సంకేతాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో మరో ఇంటికి మారిపోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే రంగంలోకి దిగిన తెలుగుదేశం నేతలు, చంద్రబాబు అవసరాలకు తగ్గ ఇంటిని వెతికే పనిలో బిజీగా మారిపోయారు.

 ఈ క్రమంలో వెలగపూడిలో 90 ఏళ్ల పాతదైన ఇంటిని టీడీపీ నేతలు పరిశీలించారు. ఈ పెంకుటిల్లును చంద్రబాబుకు ఇచ్చేందుకు వెలగపూడి మాజీ సర్పంచ్ శాంతమ్మ సంతోషంగా అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఈ ఇంటిని కలియతిరిగి పరిశీలించిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు.. మండువా లోగిలి, పచ్చటి చెట్లతో ఈ ఇల్లు బాగుందని కితాబిచ్చారు. మరి, ఈ ఇల్లు చంద్రబాబుకు కూడా నచ్చి, ఇందులోకి మారతారేమో చూడాలి. 

Andhra Pradesh
Chandrababu
Telugudesam
new home
90 years
velagapudi
  • Loading...

More Telugu News