Andhra Pradesh: విజయనిర్మల గారు చరిత్రలో నిలిచిపోతారు!: కాంగ్రెస్ నేత విజయశాంతి

  • దర్శకురాలిగా సత్తా చాటారు
  • గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు
  • ఆమె లేకపోవడం నాకు, టాలీవుడ్ కు తీరని లోటు

ప్రముఖ నటి, దర్శక-నిర్మాత విజయనిర్మల నిన్న అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి విజయనిర్మల మృతిపై విచారం వ్యక్తం చేశారు. ‘విజయనిర్మల గారి హఠాన్మరణం ఎంతో బాధాకరం. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఆ రోజుల్లో విజయనిర్మల గారు సత్తా చాటారు. ఆమె చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.

దర్శకురాలిగా ఆమె 44 చిత్రాలకు దర్శకత్వం వహించడం చాలా గొప్ప విషయం. దర్శకురాలిగా ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించి మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఈరోజు విజయనిర్మల లేకపోవడం నాకు, తెలుగుచిత్ర పరిశ్రమకు తీరని లోటు. విజయనిర్మల గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అలాగే ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని విజయశాంతి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

Andhra Pradesh
vijaya nirmala
death
Facebook
Congress
vijayasanti
  • Loading...

More Telugu News