jagan: పాలన చేతకాక జగన్ ఏదేదో చేస్తున్నారు.. తెలంగాణ నుంచి రావాల్సిన రూ. 5వేల కోట్లు ఏమయ్యాయి?: దేవినేని ఉమా

  • వైయస్ వేసిన 26 కమిటీలే ఏమీ చేయలేకపోయాయి
  • పోలవరం గురించి జగన్ ఎందుకు మాట్లాడటం లేదు?
  • రాష్ట్ర అభివృద్ధిని వదిలేశారు

విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ సీఎం జగన్ వేసిన సబ్ కమిటీ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. జగన్ కు పాలించడం చేతకాక ఏదోదే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో రాజశేఖరరెడ్డి వేసిన 26 విచారణ కమిటీలే ఏమీ చేయలేకపోయాయని... ఇప్పుడు ఈ కమిటీలు ఏం చేస్తాయని అన్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల సంగతేంటని ప్రశ్నించారు. వైయస్ వేసిన కమిటీలు దుబాయ్ లో సెటిల్ అయ్యాయని... ఇప్పుడు జగన్ వేసిన కమిటీలు ఎక్కడ సెటిల్ అవుతాయో చూద్దామని అన్నారు. పోలవరం పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత... దాని గురించి జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.  

జగన్ వేసిన కమిటీలకు సంబంధిత అధికారులు సమాధానాలు చెబుతారని ఉమా అన్నారు. టీడీపీ హయాంలో చేసుకున్న పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల గురించి జగన్ మాట్లాడుతున్నారని... తెలంగాణ నుంచి రావాల్సిన రూ. 5వేల కోట్ల బకాయిలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ బకాయిల గురించి ఎందుకు నోరు మెదపట్లేదని అడిగారు. ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిని వదిలేసి, అమరావతిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News