Andhra Pradesh: టీడీపీపై బురద చల్లడానికి, కక్షసాధింపు కోసమే మంత్రివర్గ ఉపసంఘం!: కళా వెంకట్రావు ఆరోపణ

  • అందుకోసమే ఈ కమిటీని సీఎం జగన్ నియమించారు
  • వైఎస్ గతంలో కమిటీలు వేశారు.. ఏమీ తేలలేదు
  • చంద్రబాబు నివాసంలో టీడీపీ ముఖ్యనేతల భేటీ

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు ఏపీ సీఎం జగన్ నిన్న మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ముఖ్యనేతలు ఈరోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు స్పందిస్తూ.. తెలుగుదేశం పార్టీపై బురద చల్లడానికే మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతి చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. గతంలో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా తమపై చాలా కమిటీలు వేశారనీ, అయినా ఏ ఆరోపణ కూడా నిరూపణ కాలేదని గుర్తుచేశారు. టీడీపీపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం జగన్ ఏర్పాటుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై బురద చల్లాలని చూస్తే దీటుగా స్పందిస్తామని హెచ్చరించారు.

Andhra Pradesh
Telugudesam
Chandrababu
Jagan
Chief Minister
kala venkatarao
ap Telugudesam chief
  • Loading...

More Telugu News