purandeshwari: ప్రజలను పక్కదోవ పట్టించకండి: జగన్ కు పురందేశ్వరి సూచన

  • ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం
  • హోదా పేరుతో జనాలను జగన్ పక్కదోవ పట్టించరాదు
  • ప్రజావేదికను ప్రజల అవసరాలకు వినియోగించి ఉండాల్సింది

ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని బీజేపీ నాయకురాలు పురందేశ్వరి అన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను ముఖ్యమంత్రి జగన్ పక్కదోవ పట్టించరాదని హితవు పలికారు. అనధికారిక కట్టడాలను ఎవరైనా కూల్చేయాల్సిందేనని చెప్పారు. అయితే, ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయకుండా... మరో రకంగా ప్రజల అవసరాల కోసం వినియోగించి ఉండాల్సిందని అన్నారు.

చంద్రబాబు హయాంలో అంతులేని అవినీతి చోటు చేసుకుందని పురందేశ్వరి ఆరోపించారు. అందుకే ప్రజలు టీడీపీని తిరస్కరించారని చెప్పారు. బీజేపీ మరోసారి అధికారంలోకి రాదని చంద్రబాబు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. మోదీని రెండోసారి ప్రధాని కాకుండా చేయాలని విపక్షాలన్నీ కుట్రలకు పాల్పడ్డాయని విమర్శించారు. బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్మారని... అందుకే, మరోసారి మోదీకి పట్టం కట్టారని చెప్పారు.

purandeshwari
jagan
Chandrababu
Telugudesam
bjp
ysrcp
  • Loading...

More Telugu News