Nandigam Suresh: నందిగం సురేశ్ కు కీలక పదవిని ఇచ్చిన వైఎస్ జగన్!

  • వైసీపీ లోక్ సభ ఉపనేతగా నియామకం
  • కోశాధికారిగా లావు శ్రీకృష్ణదేవరాయలు
  • ఓ ప్రకటనలో తెలిపిన వైసీపీ

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా బాపట్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నిలబడి, టీడీపీ ప్రత్యర్థి మల్యాద్రి శ్రీరామ్ పై ఘన విజయం సాధించిన నందిగం సురేశ్ కు మరో కీలక పదవిని అప్పగించారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. లోక్ సభలో పార్టీ ఉపనేతగా నందిగం సురేష్ పేరును ఖరారు చేశారు. ఇదే సమయంలో పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును జగన్ నియమించారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు ఓ ప్రకటన ద్వారా మీడియాకు తెలిపారు. కాగా, గత ఎన్నికల్లో మల్యాద్రి శ్రీరామ్‌ పై నందిగం సురేశ్ 16,065 ఓట్ల మెజారిటీతో గెలిచారన్న సంగతి తెలిసిందే.

Nandigam Suresh
Jagan
YSRCP
  • Loading...

More Telugu News