vijaya nirmala: విజయనిర్మల భౌతికకాయం పక్కనే కూర్చున్న కృష్ణ!

  • కాసేపట్లో ఆసుపత్రి నుంచి భౌతికకాయం తరలింపు
  • అభిమానుల సందర్శనార్థం రేపు ఫిల్మ్ ఛాంబర్ కు తరలింపు
  • రేపు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు

ప్రముఖ నటి, సీనియర్ నటుడు కృష్ణ భార్య విజయ నిర్మల బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, తుదిశ్వాస విడిచారు. కాసేపట్లో ఆసుపత్రి నుంచి ఆమె భౌతికకాయాన్ని తరలించనున్నారు. ఆసుపత్రిలో ఆమె భౌతికకాయం పక్కనే ఆమె భర్త కృష్ణ, కుమారుడు నరేష్ ఉన్నారు. ఆమె భౌతికకాయాన్ని ఈరోజు ఇంట్లోనే ఉంచి, అభిమానుల సందర్శనార్థం రేపు ఫిల్మ్ ఛాంబర్ కు తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

vijaya nirmala
krishna
funerals
  • Loading...

More Telugu News