vijaya nirmala: విజయనిర్మల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్

  • కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేసిన సీఎం
  • సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవ మరువలేనిదని వ్యాఖ్య
  • నిన్న రాత్రి తుదిశ్వాస విడిచిన విజయనిర్మల

ప్రముఖ సినీనటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విజయనిర్మల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవ మరువలేనిదని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

73 ఏళ్ల విజయనిర్మల నిన్న రాత్రి గుండె పోటుతో మరణించారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏడేళ్ల వయసులోనే తమిళ చిత్రరంగంలో బాలనటిగా ఆరంగేట్రం చేసిన విజయనిర్మల... 11 ఏళ్ల వయసులో 'పాండురంగ మహాత్మ్యం' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News